
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం మహిళలు, గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆందోళన చేశారు. మూడు నెలలుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని పట్టించుకునే వారేలేరని గ్రామపంచాయితీలో బైటయించి ఆందోళన వ్యక్తం చేశారు. తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు లేరని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని, పలుమార్లు ఫోన్ చేసినప్పటికి స్పందించడం లేదన్నారు. నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి తెక్చుకుంటున్నామని, మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు తక్షణమే నీటి సరఫరా చేయాలని లేనట్లయితే మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు.