పనిప్రదేశాల్లో మహిళల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించడంతోపాటు వారి కెరీర్‌కు చోదక శక్తిలా పనిచేస్తున్నది. ఉద్యోగినుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూనే ప్రతి ఒక్కరూ అభివద్ధి చెందేలా వత్తి నైపుణ్యాలను పెంచుతున్నది. ‘సిస్టర్హుడ్ ఎట్ వర్క్‌ప్లేస్’గా పిలిచే ఈ పద్ధతే ఇటు పని ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు.. అటు మహిళా ఉద్యోగులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి ఉన్నతికి మరొకరు పాటుపడేలా చేస్తుందంటున్నారు. పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలంటే ఇదీ ముఖ్యమేనంటున్నారు. మరి ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం.
”నేను మూడు నెలల క్రితం వరకు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. మా ఆఫీసులో సహోద్యోగుల మధ్య రాజకీయాలు ఎక్కువ. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి మీద మరొకరు ఎప్పుడూ చాడీలు చెప్పుకునేవాళ్లు. వాటివల్ల నేను అకారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పర్సనల్ లైఫ్ కూడా డిస్ట్రబ్ అయింది. అందుకే ఉద్యోగం, జీతం కంటే మానసిక ప్రశాంతత ముఖ్యమనిపిస్తోంది. – ఒక సొదరి ఆవేదన.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే దాన్ని. కానీ, జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదన్నా ప్రొడెక్టివ్గా చేస్తే మనకీ తప్తి ఉండాలి. వాళ్లూ సంతోషంగా ఉండాలి. కాని అక్కడి వాతావారణం అలా అనిపించలేదు. ఆర్థికంగా స్థిరపడాలని మొదట్లో ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. కానీ నచ్చలేదు. ఏదో వర్క్ ఇస్తున్నారు, చేస్తున్నా అనిపించేది. రోజూ వెళ్లడం, రావడం అంతవరకే. – మరో యువతి నిర్వేదన.
మహిళలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారు. కానీ, ఇవి కొందరికి మాత్రమే వర్తించే మాటలు. ఎందుకంటే.. కొలువుల్లో చేరిన మహిళలు ఎక్కువ కాలం ఉద్యోగాలు చేయడం లేదు. కొంత కాలం చేశాక మానేస్తున్నారు. సంపాదన, అభివద్ధి, లక్ష్యం.. ఈ దిశగా సాగాలని నిర్ణయిం చుకున్న వాళ్లు కాస్తా, మధ్యలోనే ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితం అవుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు.. ఐదంకెల జీతం తీసుకుంటున్న యువతులు.. మేనేజర్ స్థాయిలో ఉన్న మహిళలు.. ఇలా ఉన్నత స్థాయిలోని స్త్రీలు కూడా ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఏదేమైనా చేస్తున్న జాబ్ వద్దని ఇంట్లోనే ఉంటున్నారు.
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సంప్రదాయం పురుడు పోసుకుంది. ‘సిస్టర్హుడ్’గా పిలిచే ఈ ట్రెండ్.. మహిళా ఉద్యోగులను ఏకం చేస్తున్నది. పనిప్రదేశాల్లో మహిళల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించడంతోపాటు వారి కెరీర్‌కు చోదక శక్తిలా పనిచేస్తున్నది. ఉద్యోగినుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూనే ప్రతి ఒక్కరూ అభివద్ధి చెందేలా వత్తి నైపుణ్యాలను పెంచుతున్నది. ‘సిస్టర్హుడ్ ఎట్ వర్క్‌ప్లేస్’గా పిలిచే ఈ పద్ధతే ఇటు పని ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు.. అటు మహిళా ఉద్యోగులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి ఉన్నతికి మరొకరు పాటుపడేలా చేస్తుందంటున్నారు. పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలంటే ఇదీ ముఖ్యమేనంటున్నారు.
ఎందుకీ అసమానతలు?
ఈ రోజుల్లో పురుషాధిపత్యం ఉన్న రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ.. స్త్రీపురుష సమానత్వం సాధించిన రంగం ఒక్కటీ కానరాదనే చెప్పాలి. ఇందుకు.. ఆయా రంగాల్లో మహిళలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం, కెరీర్ అవకాశాలు తక్కువగా ఉండడం, పని ప్రదేశంలో వేధింపులు, వేతన వ్యత్యాసం, వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోలేకపోవడం, మానసిక ఒత్తిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయి. అంతేకాదు.. కొన్ని రంగాల్లో పని ప్రదేశంలో మహిళలే ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ.. తోటి మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహించలేకపోవడం, ఎక్కువ మంది మహిళల్ని నియమించుకోలేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుందట! ఏదేమైనా ఇలాంటి అసమానతలు తొలగి.. పని ప్రదేశంలో మహిళాభివద్ధి సాధ్యం కావాలంటే అది ‘సిస్టర్హుడ్’తోనే సాధ్యమంటున్నారు నిపుణులు. పని చేసే చోట మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించు కోవడమే దీని ముఖ్యోద్దేశం!
ఇదెలా సాధ్యమవుతుందంటే..?!
కెరీర్లో ఎదగాలంటే నెట్వర్క్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యం! ఈ క్రమంలో మనం పనిచేసే ఆఫీసుల్లో ఉద్యోగులందరితో స్నేహపూర్వకంగా మెలగడమే కాదు.. ఇతర ప్రొఫెషనల్ గ్రూప్స్‌లోనూ భాగమవుతాం. కొత్త విషయాలను నేర్చుకుంటాం. ఇలా మీరు పెంచుకున్న నెట్వర్క్ని మీ సహోద్యోగినులకూ పరిచయం చేయడం ద్వారా వారికీ వత్తిఉద్యోగాలకు సంబంధించి కొత్త కొత్త అంశాలు నేర్చుకునే అవకాశం కల్పించవచ్చు.
మనకంటే కింది స్థాయిల్లో ఎంతోమంది మహిళా ఉద్యోగులుండచ్చు. వాళ్లు కెరీర్లో ఎదిగేలా ప్రోత్సహించడం, వీలైతే మీరే వారికి మెంటర్‌గా వ్యవహరించడం, కొత్త నైపుణ్యాలు నేర్పించడం.. వంటివన్నీ తోటి మహిళా ఉద్యోగుల్ని అభివద్ధి పథంలో నడిపించే మార్గాలే!
తోటి మహిళా ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినా, పై అధికారులు వాళ్ల పనితీరును ప్రశంసించినా అసూయపడే వారూ కొందరుంటారు. ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకొని.. మహిళలు పని ప్రదేశంలో ఒకరి విజయాల్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం, ‘కీప్ ఇట్ అప్’ అంటూ వెన్నుతట్టడం వల్ల.. పనిప్రదేశంలో ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఉద్యోగినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా పని చేయాలన్న ఆసక్తి మరింతగా పెరిగి.. ఇది అటు పని ఉత్పాదకతకు, ఇటు కెరీర్ అభివద్ధికి.. రెండింటికీ దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.
పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోన్న మహిళలు ఎంతోమంది! ఆయా సమస్యలు ఎదుర్కొనేలా సాటి మహిళా ఉద్యోగులు వారికి తోడుగా నిలవాలి. సంస్థ నియమనిబంధనల్ని ఉల్లంఘించి వేధింపులకు పాల్పడే వారిపై పైఅధికారులకు ఫిర్యాదు చేయడానికీ వెనకాడకూడదు. ఇలా ఎమోషనల్‌గా కూడా పని ప్రదేశాల్లో మహిళలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వర్క్-లైఫ్ బ్యాలన్స్ ఈ రోజుల్లో చాలామంది మహిళలకు సవాలుగా మారుతోంది. దీన్ని మీరెలా అధిగమిస్తున్నారో కూడా మీ సహోద్యోగినులతో పంచుకోవచ్చు. ఇలా మీరిచ్చే సలహాలు ఇటు వ్యక్తిగతంగా, అటు కెరీర్ పరంగా.. ఇలా రెండు విధాలుగా వారికి ఉపయోగపడతాయి.
మీకు తెలిసిన మహిళల్లో.. ఆయా పనులకు తగ్గ నైపుణ్యాలున్న వారెవరైనా ఉంటే.. మీపై అధికారులకు సిఫార్సు చేయచ్చు. ఇది కూడా వారిని ఓ సోదరిగా భావించి ప్రోత్సహించడం కిందకే వస్తుంది.
పెళ్లై, పిల్లలు పుట్టిన మహిళలకు ఈ రోజుల్లో.. తగిన కెరీర్ అవకాశాలు దొరకట్లేదనే చెప్పాలి. కెరీర్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు అలాంటి వారినీ ప్రోత్సహించచ్చు. వారి నైపుణ్యాలకు తగిన అవకాశాల్ని అందించచ్చు.
‘మహిళలే సాటి మహిళల్ని అభివద్ధి పథంలో నడిపించగలరు..’ అంటుంటారు. కాబట్టి ఈ సమాజంలో మహిళలపై ఉన్న ఆంక్షలు, మూసధోరణుల్ని బద్దలు కొట్టడంలోనూ మహిళలంతా ఏకం కావాలి. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది.
మహిళలకూ, సంస్థలకూ మేలు!
పని ప్రదేశాల్లో ఈ రకమైన సహాయ సహకారాలు పెరిగి.. మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్ల ఇటు ఉద్యోగినులకు, అటు సంస్థలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు.
మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్ల పని ప్రదేశంలో పాజిటివిటీ పెరుగుతుంది. ఇది పని ఉత్పాదకతను పెంచుతుంది. తద్వారా సంస్థ అభివద్ధి చెందుతుంది.
ఇలాంటి సానుకూల వాతావరణంలో పనిచేయడం వల్ల మహిళలూ ఎంతో ఉత్సాహంగా పనులు పూర్తిచేయగలుగుతారు. ఇది వారి కెరీర్ అభ్యున్నతికి బాటలు పరుస్తుంది.
మహిళా ఉద్యోగులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడం వల్ల.. వారిలో ఒంటరితనం దూరమవుతుంది. ఇది మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుంది.. ఇంటా-బయటా మహిళలు విజయం సాధించడంలో, వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోవడంలోనూ ఈ ఆత్మీయత కీలకంగా మారుతుంది.
సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు.. సాటి మహిళల్ని కెరీర్ దిశగా ప్రోత్సహించడం వల్ల పని ప్రదేశాల్లో మహిళల శాతం పెరుగుతుంది. ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే లింగ సమానత్వం సాధించడానికి ఎన్నో ఏళ్లు పట్టదంటున్నారు నిపుణులు. నిజమే కదూ!!
ఒకే కార్యాలయంలో పనిచేసేవారి మధ్య పలకరింపులు మామూలే! అయితే, అది ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పుడు ‘గుడ్ మార్నింగ్’.. వెళ్లేటప్పుడు ‘గుడ్ నైట్’ చెప్పడం దగ్గరే ఆగిపోతున్నది. లంచ్ బ్రేక్‌లోనో.. పనిమధ్యలో కాఫీ తాగేటప్పుడో చెప్పుకొనే కబుర్లకే పరిమితం అవుతున్నది. అయితే.. ఈ సిస్టర్హుడ్ కాస్త భిన్నమైంది. ఇది.. ఉద్యోగినులతో ఐక్యతా రాగం పాడిస్తున్నది. తోటివారి ఎదుగుదలకు మద్దతు ఇవ్వాలన్న నిబద్ధతను పెంచుతున్నది. వారి విజయంలో కీలకపాత్ర పోషించాలన్న తపనను రాజేస్తున్నది.
గణనీయమైన ప్రభావం..
ఔత్సాహిక మహిళా సాంకేతిక నిపుణులకు మార్గదర్శకత్వం, మద్దతును అందించడం ద్వారా.. సాంకేతిక రంగాన్ని సిస్టర్హుడ్ ట్రెండ్ గణనీయంగా ప్రభావితం చేస్తున్నది. మహిళలు కెరీర్లో పురోగతి సాధించడంలో సాయపడటంతోపాటు వారివారి రంగాలలో మెరుగైన ఆవిష్కరణలు, సహౌద్యోగులను బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు కార్పొరేట్ సిస్టర్హుడ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నాయి. మహిళలకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు వారి కెరీర్ డెవలప్మెంట్పై దష్టిపెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. మహిళల కోసం సపోర్ట్ నెట్వర్క్ నిర్మించడమనేది.. వారి కెరీర్ పురోగతికి దోహదం చేయడమేనని నిపుణులు అంటున్నారు. అందుకే, ఉద్యోగినులూ.. ‘సిస్టర్హుడ్’కు జై కొట్టండి. మీకు తెలియని వత్తి నైపుణ్యాలను తెలుసుకోండి. తెలిసినదాన్ని పంచుకోండి. కెరీర్లో దూసుకెళ్లండి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417