ఒక పాఠశాలలో వెంకట్ అనే విద్యార్థి ఉన్నాడు. అతడు చదువులో ముందుండేవాడు. కాని, ఒక రోజు అతని స్నేహితులు, డ్రగ్స్ ను ప్రయత్నించమని ఒత్తిడి చేశారు. మొదట్లో కుదురుగా ఉండే వెంకట్, చివరికి వారి మాట విని డ్రగ్స్ ను తీసుకున్నాడు.
ఆ తర్వాత అతని చదువు దిగజారింది. ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు, అతని తల్లి ఇది గమనించి, అతనితో నెమ్మదిగా మాట్లాడింది. ఆమె అతనికి ఆప్యాయత చూపించి, అతని మనస్సును నమ్మకంతో నింపింది.
అనంతరం వెంకట్ కౌన్సిలింగ్ కు వెళ్లాడు, ఆ స్నేహితులను వదిలేసి, ఆరోగ్యకరమైన పద్ధతులను అలవాటు చేసుకున్నాడు. చివరికి, అతడు తిరిగి తన పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు.
సారాంశం: మంచి మార్గాన్ని ఎంచుకోవడం, తప్పులు సరిదిద్దుకోవడం, కుటుంబం, సమాజం మద్దతు ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది.
”విద్యార్థుల ప్రణాళిక”
పిల్లల నవ్వుల్లో పూల వాసన,
చిన్నారి కలల్లో ఆశల స్వప్నం.
చదువు పట్టుకుందామనుకుంటే,
సొమ్మసిల్లే మాయా దారులు, అపాయం.
దారి తప్పే ఇష్టం వెంట వెంటనే,
డ్రగ్స్, మద్యపాన దారిలో నడిపే పిట్టగోడ.
స్నేహితుల ఒత్తిడితో వంక పడితే,
ప్రతిఘటించి ముందుకు సాగండి.
తల్లిదండ్రులు ప్రేమ చూపాలి,
సమాధానంగా సహాయం చేయాలి.
వారికి ఆశీస్సులు ఇస్తూ,
మనసులో నమ్మకం నింపాలి.
పాఠశాలల్లో అవగాహన జ్వాల,
సత్యం, ధర్మం మార్గం చూపాలి.
మనసు గెలిచే కదలికలతో,
ఆరోగ్యకరమైన బాట చూపాలి.
చూసి నేర్చిన మార్గంలో,
కదిలించాలి తమ మనసు లోతుల్ని.
మనసులో మంచితనాన్ని నింపి,
విద్యార్థులు విజయ దారిలో నడవాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్