ఫిబ్రవరి 7న ‘తండేల్‌’ రిలీజ్‌

'Tandel' release on February 7నాగ చైతన్య నటిస్తున్న నూతన చిత్రం ‘తండేల్‌’. ఇప్పటికే ఈ సినిమాపై అందరిలోనూ మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీన్ని మరింతగా పెంచుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘బుజ్జి తల్లి’ పాట అందరిలోనూ మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది. దేవి శ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ ట్రాక్‌ మ్యూజిక్‌ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి, ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది.
నాగ చైతన్య, సాయి పల్లవి జోడిగా కనిపించిన ‘బుజ్జి తల్లి’ మెలోడిక్‌ మాస్టర్‌ ఫీస్‌గా నిలిచి, సినిమా మ్యూజికల్‌ జర్నీకి చార్ట్‌బస్టర్‌ టోన్‌ని సెట్‌ చేసిందని చిత్ర యూనిట్‌ తెలిపింది.
శనివారం నాగ చైతన్య పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్‌ పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చేతిలో బరువైన యాంకర్‌ను పట్టుకుని, వర్షపు తుఫాను మధ్య ఓడపై నాగ చైతన్య నిలబడి కనిపించారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాలో బిగ్గెస్ట్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. తండేల్‌ రాజు పాత్రను నాగచైతన్య పోషించిన విధానం భారతీయ సినిమాలో చిరకాలం గుర్తుండిపోతుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.
డిసెంబర్‌లో నాగచైతన్య కొత్త సినిమా
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నిర్మాణం చేయనుంది. ఈ సంస్థలు సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గతేజ్‌, సంయుక్త మీనన్‌లతో కార్తీక్‌ దండు దర్శకత్వంలో ‘విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలోనే ఈ తాజా చిత్రాన్ని నాగచైనత్య హీరోగా నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్‌ కూడా ఒక నిర్మాతగా ఉండటం మరో ఆకర్షణ. శనివారం నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సినిమా
ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబరులో షూటింగ్‌ ప్రారంభించుకోనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్‌ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.