సప్తాహలతో గ్రామాల్లో ఐక్యత భావం..

A sense of unity in the villages for weeks.– విఠలేశ్వర ఆలయ అభివృద్ధి పై ప్రధాన దృష్టి 
– ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 
 నవతెలంగాణ – కుభీర్
తాళ సప్తమి వేడుకలతో గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో నిర్వహించిన తాళ సప్తమి  వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. మన ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం మూలంగా, ఇక్కడ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఆనవాయితిగా తాళ సప్తమి వేడుకలు జరుపుకుంటారన్నారు. సప్తహలో ఏడు రోజులపాటు  గ్రామస్తులంతా మద్యం మాంసం మానేసి భక్తి భావంతో ఉంటారన్నారు. ఉదయం వేళ కాకడ హారతి, రాత్రివేళ భజనలు, అదేవిధంగా మన కీర్తనపరులతో  మన సంస్కృతి సాంప్రదాయ బోధనలు ఉండడం శుభ పరిణామం అన్నారు. భక్తి భావంతోనే ఐక్యత భావం పొందుతుందని, కుబీర్ వాసులంతా  విఠలేశ్వరాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.దింతో కుబీర్ లో విటళేశ్వర్ ఆలయం రెండవ పండరీపురంగా ప్రసిద్ధికెక్కుతున్న  విఠలేశ్వర ఆలయ అభివృద్ధికి తన వంతుగా పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  కాసేపు వీణాధరణ చేసి పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానిక నాయకులు  బోయిడి విఠల్,ఆలయ కమిటీ అధ్యక్షడు పెంటజీ పుప్ఫల పీరాజీ సూది రాజన్న నాగలింగం, ఏశాల దత్తాత్రి,గులాబ్ నాయక్, ప్యాట లక్ష్మణ్, పుప్పాల లింగం, ఎన్నెల నాగేందర్,   తో పాటు పలువురు ఉన్నారు.