
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో గల బిసి హాస్టల్లో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను, హాస్టల్ గదులను, భోజనశాలను, మరుగుదొడ్లు మూత్రశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సందర్భంగా విద్యార్థులకు ఎంపీడీవో సూచించారు.వసతి గృహంలో ఆర్వో ప్లాంట్, ఇన్వర్టర్, బోరు, మరుగుదొడ్ల ఇబ్బందులు ఉన్నాయని ఈ సందర్భంగా వసతి గృహం వార్డెన్ భోజేందర్ ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు. వసతి గృహం లోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఎంపీడీవో తెలిపారు. వసతి గృహంలో సౌకర్యాలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.