ఈషా గ్రామోత్సవ క్రీడలు ప్రారంభం..

Isha Gramotsava Games Begin..నవతెలంగాణ – భువనగిరి
6వ, ఈశా గ్రామోత్సవం భారతదేశ క్రీడా స్పూర్తి సమర్పించు రూరల్ ప్రీమియర్ లీగ్ 2024 సౌత్ ఇండియా లెవెల్, యాదాద్రి భువనగిరి జిల్లా స్పొర్ట్స్ డే కాంపిటేషన్  ను జిల్లా యువజన క్రీడల అధికారి కే. ధనుంజయ ప్రారంభించారు. జిల్లాలో ని వివిధ   గ్రామల నుండి  16 సవంత్సరాల నుండి 50 సవంత్సరాల వరకు పై బాడిన మహిళలు, యువతి యువకులు అందరు ఈ క్రీడ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. త్రో బాల్ 13 గ్రూపులు, వాలీ బాల్ 18 గ్రూపులు,  గేమ్స్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లో క్రీడా స్థలము ఒక్క పండుగ వాతావరణము రంగుల ముగ్గులతో, పువ్వులు అలంకరించి  ఆరట్టి చెట్టు లతో తోరణాలు, పలేటూరి  పండుగ వాతావరణము  ఏర్పటు చేశారు. ఈశా ఫౌండేషన్ వాలంటీర్లు ఒక్క వారం రోజులుగా ప్రతి గ్రామ ము తిరిగి త్రో బాల్ యొక్క  క్రీడ గురించి మేలుకువలు మహిళలకు వివరించి ఒక్క ఉత్తేజ ప్రోత్సాహము నింపి ఈషా ఫౌండేషన్ క్రీడల యొక్క ప్రాముఖ్యతను  వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రటరీ బాల కృష్ణ , ఈశ  ఫౌండేషన్ వాలెంటర్ పవన్, దివ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.