నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం, ఖమ్మం పట్టణ కేంద్రంలోని గోకులకృష్ణ ప్రాంగణం ఖమ్మం జిల్లా యాదవ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనం ( వనభోజన) మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యాదవ కురుమ కుల సోదరులు డప్పు చప్పుళ్ల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనకు రావాల్సిన వాటా మనకు రావాలి అంటే. ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు, మనం ఐక్యంగా ఉంటే వస్తాయన్నారు. గొల్ల కురుమలు నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారని అన్నారు. తీసుకున్న అప్పును అంతే నిజాయితీగా అప్పజెప్పే జాతి మన గొల్ల కురుమల జాతి అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఈ కుల గణన ద్వారా మనకు రావాల్సిన ప్రభుత్వం సంక్షేమలతో పాటు అన్ని వాటలు వస్తాయన్నారు. వంద గొర్లల్లో మన గొర్లను గుర్తుపట్టే మేధా శక్తి మన గొల్ల కురుమలకు ఉందన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో వచ్చే ఎలక్షన్స్ మన జాతి బిడ్డలకు పదవులు ఇచ్చే విధంగా నేను ఇప్పుడు ఉన్న మంత్రులను కోరుతనన్నారు. మనం అందరం ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చని అన్నారు.