
తిరుమలగిరి సాగర్ మండలం,అల్వాల గ్రామానికి చెందిన పల్ రెడ్డి యశోదమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం వారి నివాసంలో యశోదమ్మ పార్టివ దేహానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవా ప్రధాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించి మృతురాలి కుమారులు నరసింహారెడ్డి, వెంకటరెడ్డి లను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి,మాజీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,దోరేపల్లి చంటి యూత్ ,గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శివానంద రెడ్డి, ఇస్రం లింగస్వామి,అబ్దుల్ కరీం,వంగాల భాస్కర్ రెడ్డి, నితిన్,బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ తదితరులు పాల్గొన్నారు.