ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సత్యదేవ్‌

ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సత్యదేవ్‌సత్య దేవ్‌, డాలీ ధనంజరు నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేష ఆదరణతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో సత్య దేవ్‌ మాట్లాడుతూ, ‘డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తీక్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమాతో నన్ను రాటుతేలేలా చేశాడు. చిరంజీవి చెప్పినట్లు ‘జీబ్రా’ సూపర్‌ హిట్‌ అయింది. అన్నింటికీ అతీతంగా ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ప్రతి చోటా హౌస్‌ ఫుల్స్‌ అవుతున్నాయి. ఆడియన్స్‌ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.