నవతెలంగాణ – కామారెడ్డి
డిసెంబర్ నెల నాలుగవ తేదీన జిల్లా వ్యాప్తంగా 3, 6 ,9 తరగతుల విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించబోతున్నాము అని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సర్వేలో పాల్గొనడానికి జిల్లా వ్యాప్తంగా 150 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా బిఈడి, పి. జి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందనీ, వీరికి ఈ నెల 26, 28 వ తేదీలలో శిక్షణ ఇవ్వబోతున్నాము అన్నారు. అదేవిధంగా 92 మంది పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. దీనికోసం ఇప్పటికీ 3 సార్లు మాక్ టెస్ట్ అన్ని పాఠశాలలలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి, మాక్ టెస్ట్ పేపర్ లను విశ్లేషణ చేయించి, మాడల్ పేపర్లను ,క్వశ్చన్ బ్యాంకులను విస్తృతంగా ప్రాక్టీసు చేయించి విద్యార్థులను, పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి మన జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 4 వరకు అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాల లలో ఎన్ ఏ ఎస్ సన్నద్ధత కోసం ప్రత్యేక పీరియడ్ నిర్వహించాలనీ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సందర్భంగా సూచిస్తున్నామన్నారు.