గొర్రెల కాపరులు పోరాడి సాధించుకున్న జీవోలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి

– జి ఎం పి ఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గొర్రెల కాపర్లు పోరాడి సాధించుకున్న 1016,559 జీవోలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో పత్రికా ప్రకటన విడుదల చేసి పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. మేకల పెంపుకొని దార్ల సంఘం ఆధ్వర్యంలో  గొర్రెల మేకల పెంపకదారులు అనేక సంవత్సరాలు ప్రభుత్వాలపై పోరాడి 1016,559జీవోలను పోరాడి సాధించుకున్నారని వివరించారు.1996 జూలై 9న విడుదల చేసిన 559 జీవో ప్రకారం ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు,శిఖం భూములు,గుట్టల వెంట గొర్రెలు,మేకలను మేపుకోవడానికి  అవకాశం ఉందన్నారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్ల రామన్నపేట,వలిగొండ, పోచంపల్లి, భువనగిరి,యాదగిరిగుట్ట, చౌటుప్పల్,నారాయణపురం మండలాల్లో ఉన్నటువంటి గుట్టలను మైనింగ్ అధికారుల సహకారంతో స్థానిక సంస్థలు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లీజుకి ఇస్తున్నారని విమర్శించారు. గుట్టలు బోళ్లను లీజుకి ఇవ్వడం వల్ల జీవాలకు మేత కొరత ఏర్పడుతుందని, ఫ్యాక్టరీలు, కంకర మిల్లులు వెదజల్లే దుమ్ము, ధూళి గడ్డి మొక్కలపై పడి వాటిని గొర్రెలు మేకలు, పశువులు వేయటం వల్ల జీవాలు శ్వాస,గర్భ కోశ వ్యాధులతో మరణిస్తున్నాయని గొర్లకాపరులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1997 ఆగష్టు1న విడుదల అయిన 1016 జీవో ప్రకారం చెరువులు,కుంటలలో ఉన్న తుమ్మ మండ మేపుకొనుటకు జిల్లా కలెక్టర్లు జీవోలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఆయన వెంట జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహ్మ, అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ, ఉపాధ్యక్షులు బుగ్గ చంద్రమౌళి ఉన్నారు.