నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, మామిడిపల్లిలోని మోడల్ స్కూల్ లను సోమవారం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ రమేష్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట పాత్రలను శుభ్రంగా ఉంచాలని వంట చేసే వ్యక్తులు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని వంట చేయాలని వారికి సూచించారు. కుళ్లిన కూరగాయలు కానీ నాణ్యతలేని ఆహార పదార్థాలను వంటలో వాడకూడదని హెచ్చరించారు. వంటగది వంటగది పరిసరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ కృష్ణమూర్తి , సబ్ యూనిట్ అధికారి సాయి, జక్కుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.