నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో సోమవారం కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు.