సంచార బీసీ లోని కులాలకు విద్య ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి

నవతెలంగాణ- నవీపేట్: ఏడు దశాబ్దాల తర్వాత బీసీ- ఏ జాబితాలో చేర్చిన 13 సంచార కులాలకు విద్యా, ఉపాధి మరియు రాజకీయ రంగాలలో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాలని హైదరాబాద్ బిసి కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ కు సోమవారం 13 సంచార కులాల రాష్ట్ర కమిటీ తరఫున విన్నవించారు. ఈ సందర్భంగా సంచార మోహన్ చవాన్  పవార్ కైలాష్ మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా ఎటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి మరియు రాజకీయ రిజర్వేషన్లను పొందలేదని కాబట్టి తమ  సామాజిక  వర్గాల అభివృద్ధి కోసం ఎంబీసీ జాబితాలో చేర్చడం, ప్రత్యేక ఫెడరేషన్ లేదా కార్పోరేషన్ ఏర్పాటు మరియు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులను కేటాయించాలని, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని బీసీ కమిషన్ ను కోరారు.