
స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్ టి యు) ములుగు జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా ఆర్ధిక కార్యదర్శిగా తాడ్వాయి మండలం లోని ఇందిరా నగర్ పాఠశాలలో పనిచేస్తున్న పోరిక శంకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన ఎస్ టి యు జిల్లా ఆర్థిక కార్యదర్శి పోరిక శంకర్ మాట్లాడుతూ నా ఎంపిక కు సహకరించిన జిల్లా బాధ్యులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ళ మధుసూదన్ గార్లకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోలం కృష్ణయ్య గారికి, మండల బాధ్యులు కందిక రాజు, జన్ను శ్యామ్సన్ గారికి ధన్యవాదములు తెలిపారు. జిల్లాలో సంఘ నిర్మాణానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు పర్వత రెడ్డి, జిల్లా బాధ్యులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ళ మధుసూదన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోలం క్రిష్ణయ్య, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.