
నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి సతీమణి వెంకటలక్ష్మి హన్మకొండలోని తమ స్వగృహంలో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి వెంకటలక్ష్మి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, యాదగిరి రెడ్డితదితరులు ఉన్నారు.