– యువకులు గమనించి హతమార్చిన వైనం
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో కొండ చిలువ సంచరించడం సోమవారం కలకలంరేపింది. కాలనీలోని కొండ చిలువ సంచారాన్ని గమనించిన యువకులు, మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు యువకులు కొండ చిలువ హతమార్చారు.