గ్రామంలోని సిసి ఫుటేజీల ద్వారానే నిందితులను పట్టుకున్నాము

– నిందతులందరూ పాత నేరస్తులే
– కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు
నవతెలంగాణ –  కామారెడ్డి బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలో ఈనెల 20 న పనిచేస్తున్న బల్లెముల సుగుణ ( 56 )ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసును దొంగలించినట్లు మృతురాలి కుమారుడు బాల్యముల రాజు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డిఎస్పి నాగేశ్వరరావు మాట్లాడుతూ దర్యాప్తుల భాగంగా కంచర్ల గ్రామంలోని సిసి ఫుటేజ్ లను సంఘటన జరిగిన సమయానికి అటు ఇటుగా పరిశీలించి దాని ఆధారంగానే నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన దండవుల నవీన్ పల్లెకు ప్రసాద్ పల్లెకు సాలవలను సోమవారం అరెస్టు చేసి వారి నుండి దొంగలించిన సొత్తు మూడు తులాల బంగారం పుస్తెలతాడును హత్యకు ఉపయోగించిన రాడును బైకును ఎవిడెన్స్ లను వారి నుంచి సేకరించడం జరిగిందఎన్నారు. ఈ నేరంలో రెండవ నియమితుడైన మల్లయ్య తన ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఈనెల 22న ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా అదే రోజు రాత్రి కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11 గంటలకు మృతి చెందాడు అన్నారు. ఈ విషయంలో వి పట పోలీస్ స్టేషన్ల కేసు నమోదు అయిందన్నారు.

గతంలోని ఎన్నికలపై ఇదే విధమైన కేసులో సిరిసిల్ల, సిద్దిపేట్ హుస్నాబాద్  పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయి ఉన్నాయన్నారు.ఈ కేసుతో సంబంధమున్న నలుగురు వ్యక్తులు పాత నేరస్తులేనని ఒక్కొక్కరిపై 24, 14, 8 వరకు కేసులు ఉన్నాయన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన దండగుల నవీన్ పైన ఇప్పటివరకు ఐదు హత్య కేసులు, 9 దొంగతనం కేసులు మొత్తంగా 14 కేసులు ఉన్నాయని, రెండవ నిందితుడైన అల్లెపు మల్లయ్యపై 24 కేసులో ఉన్నాయన్నారు. ఆల్లెపు మల్లయ్య భార్య సాలవ ఇద్దరిపై కలిసి ఎనిమిది కేసుల వరకు ఉన్నాయన్నారు. నిందితులు పథకం ప్రకారం మైళ్లను హత్య చేసి ఆమె బంగారం పుస్తెలతాడు దొంగతనం చేసిన నేరంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ హత్య, దొంగతనం కేసును సేదించిన భిక్నూర్ సీఐ సిఐఎం సంపత్ కుమార్, కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది, బిక్నూర్ ఎస్సై సాయికుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ సైదయ్య, రాజా గౌడ్, గడ్డం నరేష్ కుమార్, శ్రవణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ ఈ కేసులో అభినందించడం జరిగిందని ఆయన తెలిపారు.