కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాల లో వైద్య శిబిరం

Medical Camp at Kasturibha Gandhi Girls Schoolనవతెలంగాణ- జమ్మికుంట
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూరిభా గాంధి బాలికల గురుకుల విద్యాలయంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో  వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. స్వల్ప జ్వర మున్న ముగ్గురికి ఆర్ డి టి కిట్స్ ద్వారా మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు… ఈ సందర్బంగా విద్యాలయంలోని బాలికలకు డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి వ్యక్తి గత, పరిసరాల పరిశుభ్రత, రక్త హీనత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గుణ్య, మెదడువాపు, టైఫా యిడు, జాండిస్ మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి క్లుప్తంగా బాలికలకు తెలిపారు.
చేతుల పరిశుభ్రత గురించి, హ్యాండ్వాష్ టెక్నిక్యూస్,బయటి తిను బండారాల జోలికి పోకుండా, మంచి పోషక హార పదార్తాలు తీసుకోవాలన్నారు. ఆకుకూరలు, పాలు, పండ్లు , గ్రుడ్లు తీసుకున్నట్లయితే రక్త హీనత రాకుండా ఉంటుంది అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేహించుకోవాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటరు మోహన్ రెడ్డి, సూపర్ వైజర్ అరుణ, విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ సుప్రియ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎం సరళ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు..