హైదరాబాద్ : తెలంగాణ ఫెన్సింగ్ సంఘం (టిఎఫ్‌ఏ) రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ జట్లకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది. త్వరలో జరుగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఈ సెలక్షన్ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. సొంత ఫెన్సింగ్ కిట్‌తో పాటు వయసు ధవీకరణ పత్రాలతో హాజరు కావాలని తెలంగాణ ఫెన్సింగ్ సంఘం సెలక్షన్ కమిటీ సభ్యులు ఎల్. సందీప్ కుమార్ జాదవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న గచ్చిబౌలి స్టేడియం హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి.