నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘వికటకవి’. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈనెల 28 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, ‘ఈ కథను సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 నిర్మించింది. కంటెంట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. దర్శకుడు ప్రదీప్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సాగర్, మహేంద్ర ఇలా.. అందరూ కష్టపడి చేశారు. నరేష్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి విజయాలు దక్కాలి. మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు’ అని అన్నారు. ‘ఇంత క్వాలిటీతో తెలుగులో ఏ సిరీస్ రాలేదనిపించింది. ప్రదీప్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని నరేష్ అగస్త్య చెప్పారు. మేఘా ఆకాష్ మాట్లాడుతూ, ‘సాయి తేజ అద్భుతంగా ఈ కథ రాశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రదీప్‌కి థ్యాంక్స్. నరేష్‌తో పని చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ”సర్వం శక్తిమయం’ తరువాత రామ్ తాళ్లూరిని కలిశాను. ఈ కథను ఆయన వినిపించారు. నాకు అద్భుతంగా నచ్చింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. నరేష్ అద్భుతంగా నటించారు. లక్ష్మీ పాత్రను మేఘా ఆకాష్ చక్కగా పోషించారు’ అని దర్శకుడు ప్రదీప్ మద్దాలి చెప్పారు. జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, ‘సాయితేజ్ అద్భుతమైన కథ చెప్పాడు. క్లైమాక్స్‌ని ఊహించలేకపోయాం’ అని అన్నారు. దర్శక, రచయిత బీవీఎస్ రవి, జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ అజరు అరసాడ, కెమెరామెన్ షోయబ్ తదితరులు ఈ సీరిస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.