– నూతన వధూవరులకు శుభాకాంక్షలు
నవతెలంగాణ-హైదరాబాద్
ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన లోకసభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అంజలి, అనీష్‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు