నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహణకు ఎంపిక చేయబడిన ఫీల్డ్ ఇన్ఫ్రిజిరేటర్స్ కు శిక్షణా ను జిల్లా విద్యాశాఖ అధికారి కే సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారం వెన్నెల కళాశాలలో ఎన్ఏఎస్ 2024 ఎన్సీఈఆర్టీ, సిబిఎస్ఇ భారత ప్రభుత్వ విద్యా మంత్రత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి సెక్రెటరీ ఆడిపాండు, కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, మాస్టర్లు షేక్ జానీ, కే నరసింహచారి పాల్గొన్నారు.