చారిత్రకమైన కట్టడాలను నాగరికతల పరిరక్షించుకోవడం నేటి తరానికిఆవశ్యకత ఉందని వాటిని పరిరక్షించుకోవాలని ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి తెలిపారు. మంగళవారం వారసత్వ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఖిల్లా వద్ద ఏర్పాటుచేసిన సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రకమైన కట్టడాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ భువనగిరి, రాచకొండ వారసత్వ కట్టడాల గొప్పతనాన్ని కీర్తించారు. పురావస్తు ప్రదర్శనశాలలో శాఖ ఉపసంచాల కులు నాగలక్ష్మి మాట్లాడుతూ వాసత్వంగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిదని ఆ కట్టడాలు ఆ సాంప్రదాయాలు అలనాటి రాచరిక మరియు చరిత్ర ఇతి వృత్తానికి నిదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భవిష్యత్ తరాలకు అందించుకునేందుకు వాటిని సంరక్షించుకోవాలని కోరారు, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతారోహకురాలు పడమిటి అనిత, హెరిటేజ్ కమిటీ సభ్యులు జంపాల అంజయ్య గారు, దిడ్డి బాలాజీ,టీచర్స్ శ్రీధర్ సార్, శ్యాం సార్, జ్ఞానేశ్వరి ,వివిధ పాఠశాలల సిబ్బంది, భువనగిరి ఖీల్లా సిబ్బంది పాల్గొన్నారు.