మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయాగ్రాములలో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం వేడుకల నుఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను చదివారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.