ఆ నాయకుడు పెత్తనంపై గరం గరం..?

నవతెలంగాణ-ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఓ నాయకుకుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బీజేపీ పార్టీ నుండి గెలుపొందారు. అయితే ఈ పార్టీకి చెందిన మండల నాయకుడు ఒక్కరు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్ద పెత్తనం చేయడంపై విమర్శలు రావటం చర్చనీయాంశం గామారింది. శాంతిభద్రతల కాపాడే కార్యాలయంలో ఆ నాయకుడి హవా కొనసాగుతుందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
దీంతో సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పలు సంఘటనలు నవతెలంగాణ దృష్టికి వచ్చాయి. ఆ నాయకుడి వ్వవహారంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అయినా సదరు ముధోల్ నియోజకవర్గం పాలకుడు మాత్రం సదరు నాయకుడికి మద్దతు తెలుపుతుడంటం పై పలువురు అంతర్గతంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ నాయకుడు పెత్తనం చేయడంపై పలువురు అధికారుల కూడా బయటకు చెప్పుకోలేక మదనపడుతున్నరన్న వాదనలు లేకపోలేదు. ఈవిషయం లు అన్ని తెలిసిన నియోజకవర్గ పాలకుడు పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాయకుడి పెత్తనం పై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఏదిఏమైనా ఆ నాయకుడు తీరుపై ఏలాంటి చర్యలకు దారి చూస్తుందే వేచి చూడాలి మరి..!