నవతెలంగాణ హైదరాబాద్: సంపూర్ణ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ కేంద్రం అయిన ది అరవింద్ స్టోర్, కస్టమర్‌లకు అసాధారణమైన షాపింగ్ అనుభూతిని అందించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గ్రేట్ ఫ్యాషన్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, ది అరవింద్ స్టోర్ ప్రత్యేకమైన లగ్జరీ ప్రిమాంటే సూటింగ్ కలెక్షన్‌ను విడుదల చేయటంతో పాటు ఎథ్నిక్ వేర్, సూట్‌లపై కాంప్లిమెంటరీ స్టిచింగ్ సేవలను పరిచయం చేస్తోంది. ఈ ఆఫర్ మీకు సమీపంలోని అరవింద్ స్టోర్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. కస్టమైజేషన్‌ని కోరుకునే కస్టమర్‌లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి, ఉచిత కుట్టు సేవలను అందించడానికి అరవింద్ తగిన చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో, అరవింద్ ప్రిమాంటే, ఎత్నిక్ వేర్, ఇతర ఉత్తేజకరమైన కలెక్షన్‌లతో కూడిన కొత్త డ్రాప్ కలెక్షన్‌ను కూడా ఆవిష్కరిస్తోంది. ఎత్నిక్ కలెక్షన్ లో మృదువైన, తేలికైన, శ్వాసించతగిన, చర్మంపై సున్నితంగా ఉండే, గరిష్ట సౌకర్యాన్ని అందించే సహజ వస్త్రాలు ఉన్నాయి. ప్రిమాంటే కలెక్షన్ లో ఈజిప్షియన్ గిజా కాటన్, సూపర్‌ఫైన్ యూరోపియన్ లినెన్స్ మరియు ఆస్ట్రేలియన్ మెరినో వూల్‌తో సహా విలాసవంతమైన వస్త్ర శ్రేణి వుంటుంది. ఈ కలెక్షన్ లో ప్రతి డిజైన్ ప్రత్యేకమైనది మరియు మా ఇటాలియన్ స్టూడియోలో రూపొందించబడింది. ఇది ఆధునిక జీవనశైలికి, సున్నితమైన ఫ్యాషన్ పట్ల అభిరుచికి సరిగ్గా సరిపోతుంది. గ్రేట్ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో మాతో చేరండి. అరవింద్ యొక్క ఉచిత స్టిచింగ్ సేవలు, ప్రత్యేక కలెక్షన్ లతో అత్యుత్తమ ఫ్యాషన్‌ను అనుభవించండి.