నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 15 16 17 తేదీలలో చౌటుప్పల పట్టణ కేంద్రంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయని మహాసభల జయప్రదం కోసం యాదగిరిగుట్ట, పెద్దకందుకూరు గ్రామాలలో గోడ రాతలు రాశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, మూసి కాలుష్య సమస్య, పరిశ్రమల కాలుష్య సమస్య అనేకరకాల ప్రజా పోరాటాలను సీపీఐ(ఎం) నిర్వహించిందని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాన్ని పక్కకు పెట్టి అధికారం కోసం కమిషన్ల కోసం పరిపాలించారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల పట్టణ కేంద్రంలో జరుగు సీపీఐ(ఎం) జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, పెద్దకందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని మాధవి రాములు గౌడ్, మాజీ సర్పంచ్ భీమగాని రాములు గౌడ్ ,మండల నాయకులు కాలే స్వామి తదితరులు పాల్గొన్నారు.