బాలిక మృతికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి: యూఎస్ఎఫ్ఐ

State govt should be morally responsible for girl's death: USFI– విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గిరిజన బాలిక మృతికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల స్కూల్ విద్యార్థిని మృతికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. గత నెల 30వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వలన 60 మంది విద్యార్థులు అస్పస్థకు గురైన సందర్భంలో, వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. అయితే అందులో 9 వ తరగతి చదువుతున్న శైలజ అనే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పై ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందించిన, పరిస్థితుల్లో మార్పు రాలేకపోవడం వలన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారని అన్నారు.అయితే ఈ నెల 25వ తేదీన శైలజ తుది శ్వాస విడిచిందని అక్కడున్నటువంటి వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని అన్నారు.అదేవిధంగా ఈ మృతికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ శైలజ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో, గురుకులాలలో, కేజీబీవీ లలో,ప్రభుత్వ పాఠశాలలో తరచూ అందించే భోజన నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇతర విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గణేష్ యుఎస్ఎఫ్ఐ నాయకులు ఆశీర్వాదం,అల్తాఫ్,అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.