నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి..

Give funds for constituency development.– బాసర అమ్మవారి దర్శనానికి రండి..
– ప్రధాని మోడీని కోరిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్..
నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ నియోజకవర్గఅభివృద్ధికి  ప్రత్యేక నిధులు ఇవ్వాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎమ్మెల్యే పవార్  రామారావు పటేల్ కోరారు. బుధవారం తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి  ఆయన ఢిల్లీ బయలుదేరి వేళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ముధోల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట  కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని, కేంద్ర నిధులు ఇచ్చి తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన  చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి రావాలని  మోడీని ఎమ్మెల్యే  ఆహ్వానించారు. సి ఎస్ ఆర్ నిధులు, అంతర్ రాష్ట్ర రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు,  ఉపాధి హామీ పథకంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాల్సిందిగా  కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఓక్క ప్రకటనలో బుధవారం తెలిపారు.  సంబంధిత శాఖ మంత్రులకు తెలియజేసి ప్రత్యేక నిధులు కేటాయించేటట్లు చూస్తానని అన్నట్లు ఎమ్మెల్యే పటేల్ పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన  పలు సమస్యలను కేంద్రమంత్రికి ఎమ్మెల్యే పటేల్ విన్నవించారు.