నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికను తరచూ వేధింపులకు గురిచేశాడు. బాలికను వేధించడంతో బాలిక తల్లిదండ్రులు నాలుగవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సంబంధిత నాలుగో పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసామన్నారు.