విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ రాహుల్ శర్మ భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు విద్యార్థులతో ప్రతి శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు ప్రతి శుక్రవారం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేయాలని.సూచన.చేశారు.మల్లారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బియ్యం, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పాటించాలని ఆదేశించారు. నాణ్యత లోపించిన వస్తువులను వాడరాదని సంబంధిత ఎస్‌ఓ (స్పెషల్ ఆఫీసర్)ను ఆదేశించారు.విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముకాముఖీ చర్చ నిర్వహించి, అల్పాహారం మరియు భోజన సదుపాయాల నాణ్యత గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, భోజనం బావుంటుందా, సరిపోను పెడుతున్నారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమాదానికి సంతృప్తి చెందిన కలెక్టర్ భోజనం రుచిగా ఉందని ఎస్‌ఓను, వంట సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆహార నాణ్యతను పాటించాలని స్పష్టంగా సూచించారు. చలికాలంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్ ఓ. ప్లాంటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేశారు కానీ మరమ్మతులు చేపించాల్సి ఉందని ఎస్ఓ కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి కుమార్, ఎస్ ఓ మహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.