– మూడో వన్డేలో జింబాబ్వేపై గెలుపు
బులవయో (జింబాబ్వే): నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జింబాబ్వేపై 99 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. 304 పరుగుల ఛేదనలో జింబాబ్వే 204 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (51, 63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ రాణించినా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. మారుమని (24), బెనెట్ (37), విలియమ్స్ (24), క్లైవ్ (20), రిచర్డ్ (17) జింబాబ్వే స్కోరు 200 దాటించగలిగారు. 40.1 ఓవర్లలో 204 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే 99 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు, కమ్రాన్ గులామ్ (103, 99 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్ తొలి సెంచరీతో మెరువగా.. పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 303 పరుగులు చేసింది. అబ్దుల్లా (50), రిజ్వాన్ (37), సల్మాన్ (30), ఆయుబ్(31), తహిర్ (29) రాణించారు. కమ్రాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. 2-1తో వన్డే సిరీస్ పాకిస్థాన్ వశమైంది.