విజన్ ఏంపవర్మెంట్ జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫేర్ తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని నలు దిశల చాటి చెప్పడం ఎంతో సంతోషంగా వుందని స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులైనప్పటికీ ప్రతి విద్యార్థిని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ స్థాయిలో విజన్ ఏంపవర్మెంట్ వారు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ తమ పాఠశాలకు చెందిన ఆస్మా అనే అంద విద్యార్థిని జాతీయస్థాయిలో విత్తనాలు మొలకెత్తడం అనే అంశంపై ప్రదర్శించి, క్లుప్తంగా వివరించి అవార్డులు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కెల్లా ఆస్మా తన నైపుణ్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి ఇతర భాషల్లో విద్యార్థులతో సైతం పోటీపడి గెలుపొందడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. అలాగే నవంబర్ మాసంలో జరిగిన జిల్లా స్థాయి మానసిక దివ్యాంగుల క్రీడా పోటీల్లో సైతం భవిత, సాయి జాహ్నవి అక్షయ చెస్, షాట్ పుట్, రన్నింగ్ పోటీల్లో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ నిర్వాహకులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పేర్కొన్నారు. మానసిక దివ్యాంగులు అని చిన్న చూపు చూడకుండా జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా సంక్షేమ అధికారులు ప్రతి ఒక్కరి సహకారంతో విద్యార్థుల నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థులకు స్నేహ సొసైటీ తరఫున నగదుకు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్దయ్య, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ కనబరిచిన స్నేహ సొసైటీ అంద విద్యార్థిని
నవతెలంగాణ – కంఠేశ్వర్