అజిత్‌కుమార్, మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీజ్ చేసుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే, సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా ఫర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో సినిమా యాక్షన్ బేస్డ్ మూవీగా తెరకెక్కింది. అజిత్ దేని కోసమో అన్వేషిస్తున్నారు. చివరకు తనకు కావాల్సిన దాని కోసం విలన్స్ భరతం పడుతున్నారు. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్లటానికైనా, ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో ఆయన మెప్పించబోతున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. అలాగే ఇందులో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వారి పాత్రలను కూడా టీజర్‌లో రివీల్ చేశారు.