కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరులో జరిగే రైతు పండగ మహాసభ దామరచర్ల మండలం నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామరచర్ల నుండి శనివారం పెద్ద ఎత్తున రైతులు బస్ లలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీ చేయడం తోపాటు, పండించిన పంటకి బోనస్ రూ.500 ఇవ్వడం జరుఫుతుందని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం , రైతు బీమా, రైతు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పట్టపరిహారం ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.