
ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనాభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాలను అందించాలని శనివారం బి ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నంత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, రాష్ట్రంలో పలు గురు విద్యార్థులకు ఆహారం వికటించి ఆస్పత్రి పాలయ్యారని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు పడిగేల శ్రీనివాస్, నాయకులు మహిపాల్, బాల్ దేవ్ అంజయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, పూసల లింగం తదితరులు పాల్గొన్నారు.