
ఇటీవల ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ సి కాశిం ను జిల్లా కు చెందిన హరిదా రచయితల సంఘం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో శనివారం ఆత్మీయంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, డి. గోపాల్, డాక్టర్ సల్ల సత్యనారాయణ, ఎస్. గంగాధర్ పాల్గొన్నారు.