‘నేతా నహీ.. నీతీ బదలావో…’ అన్నారు మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి. నేతలను కాదు, వారి విధా నాలను చూడండని దానర్థం. అయితే సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతూ…దేశం అనేక రంగాల్లో దూసుకు పోతున్న తరుణంలోనూ కొందరు గుడ్డిగా, మూర్ఖంగా వ్యక్తిభజన చేస్తూ, వాదిస్తూ వాస్తవాలను పట్టించు కోకపోవటం ఆందోళనాకరం. మన దేశానికి చెందిన ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డారు. వారిలో వివిధ రంగాల్లోనూ రాణించిన వారూ ఉన్నారు. విచిత్రమేమంటే ఆయా ఎన్‌ఆర్‌ఐల్లో ఎక్కువమంది భారతదేశంలోని వాస్తవ పరిస్థి తులను, ప్రజల దైనందిన సమస్యలను గుర్తించకుండా ‘అంతా బ్రహ్మాండంగా, సూపర్‌గా ఉందని అనుకోవటం…’ ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం సూపర్ పవర్‌గా వెలిగిపోతోందని చాలామంది భ్రమ పడుతుండటం బాధాకరం. ఇటీవల ఓ ఎన్‌ఆర్‌ఐ మిత్రుడి వద్ద ఇదే విషయం ప్రస్తావనకు వస్తే…’ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇవ్వలేదు, విదేశాల్లోని నల్లధనాన్ని తేలేదు, ప్రతీ భారతీయుడి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేయలేదు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులకు మద్దతు ధరల్లేవు… అందువల్ల మీరు అక్కడ కూర్చుని మోడీకి భజన చేయటం కాదు, ఇక్కడికొచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి…’ అని చురకలం టించాల్సి వచ్చింది.
-కే.నరహరి