హైదరాబాద్ : వినియోగదారులు సులభంగా ట్రేడింగ్ చేసుకునేందుకు వీలుగా యూజర్ ఫ్రెండ్లీ ట్రేడింగ్ యాప్ ‘అగ్నిక్’ను ఆవిష్కరించినట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ హోల్‌టైం డైరెక్టర్ సిఎ జషన్ అరోరా తెలిపారు. ఈ యాప్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ బేస్ వేగంగా వృద్థి చెందుతుందన్నారన్నారు. ఎన్‌ఎస్‌ఇ రిపోర్ట్ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లో ఇన్వెస్టర్లు 52 శాతం పెరిగారన్నారు. ఈ డిమాండ్ తమ అగ్నిక్‌కు ఉపయోగపడనుందన్నారు. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాల పెట్టుబడి కోసం పేపర్‌లెస్ ఇకెవైసి ప్రక్రియ ద్వారా ఉచిత డిమ్యాట్ ఖాతాను అందిస్తున్నామన్నారు.