బోల్తా పడిన టమాటా వాహనం

An overturned tomato vehicle– టమాటాల కోసం ఎగబడిన జనం
నవతెలంగాణ-కోదాడరూరల్‌
టమాటా లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడటంతో జనం ఎగబడి తీసుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని చిమ్మిర్యాల క్రాస్‌ రోడ్‌ వద్ద జాతీయ రహదారి-65పై శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు నుంచి జగ్గయ్యపేట రైతు మార్కెట్‌కు టమాటా లోడ్‌తో వెళ్తున్న బొలేరో వాహనం ముందు వైపు ఉన్న బంపర్‌ ఊడిపోవడంతోపాటు డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కానీ టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి పోయాయి. వాహనదారులు, స్థానికులు ఎగబడి టమాటాలను తీసుకెళ్లారు.