ఐఎంఏ, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ..

Aids awareness rally under the auspices of IMA and Lines Club..– నా ఆరోగ్యం.. నా హక్కు 
నవతెలంగాణ – కామారెడ్డి 
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహనపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ బైక్ ర్యాలీని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో 40 మంది వరకు డాక్టర్లు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నా ఆరోగ్యం నా హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ మన ఆరోగ్యం పై మనదే బాధ్యత అని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎయిడ్స్ పై అవగాహన పెంచుకొని దురా అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ గోపాల్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఐఎంఏ, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ముందు ముందు మరిన్ని కార్యక్రమాలను చేసేందుకు ఐఎంఏ ముందుకు రావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ బైక్ ర్యలి కామారెడ్డి మున్సిపల్ వద్ద ప్రారంభమై స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, జిపిఎం రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా, ఐ ఎం ఏ హాల్ వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు డాక్టర్ వెంకట్, డాక్టర్ రమణ, డాక్టర్ వెంకటేశ్వర గౌడ్, డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ రవీందర్ రెడ్డి, 40 మంది వరకు డాక్టర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.