ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతి..

Police Kishtaiah's birthdayనవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్య 15 వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రవీణ్, సాయి, బిజెపి మండల అధ్యక్షులు కోరి  పోతన్న తదితరులు పాల్గొన్నారు.