ఎంపీ ఎన్నికల సమయంలో తాను గెలుపొందితే శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయనికి వస్తానని మొక్కుకున్న సురేష్ షట్కార్ జహీరాబాద్ ఎంపీగా గెలుపొంది తన మొక్కును ఆదివారం తీర్చుకున్నరు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ అలీ షబ్బీర్, సురేష్ షట్కార్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, గడుగుల శ్రీనివాస్, కామారెడ్డి మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, నౌసి నాయక్, బిబిపెట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, అనంతరెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.