ప్రజా పాలన – సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డు ఇందిరా నగర్ లో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయోత్సవ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చేలా ప్రజాపాలన తీసుకోరావడం జరిగిందని అన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉండకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ముఖ్య ఉద్దేశ్యం సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న పథకాలను అందరికీ ప్రతి పేదవానికి అందాలని అన్నారు. మన ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిగా నేనున్నానంటూ ఏ కష్టం వచ్చినా అందుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత సంవత్సరం నుండి ప్రభుత్వ వచ్చి వారం రోజులు గడవక ముందే ప్రజల్లోకి ప్రజాపాలనను తీసుకురావడం జరిగిందని ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు, దానితో ప్రజలకు ఎంతో మేలు జరగడమే కాకుండా ప్రభుత్వమే మీ వద్దకు వచ్చేలా తీసుకు వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారెంటీల పథకాలపై ప్రజలకు సవినయంగా వివరించడమే కాకుండా, ఆ పథకాలు అందడంలో ఎలాంటి సందేహాలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పలాలు పోందాలని అన్నారు . ఈసందర్భంగా కాలనీ ప్రజలతో కలిసి కాలనీ లో ఉన్న పిచ్చి మొక్కలు పీకి పరిశుభ్రతను చాటారు. ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్ గోపే బాబు మున్సిపల్ సిబ్బంది పొట్ట శ్రీనివాస్, వసంత, బర్రె శ్రీధర్, మంజు, రాధా, పాల్గొన్నారు.