
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం అమృత మహారాష్ట్ర బ్లేస్సీ క్యామ్ ఫార్మ్స్ ఇండస్ట్రీస్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెదురు మొక్కల సాగు అనుకూలతలు పరిశీలించేందుకు,వెదురు సాగుతో లాభాలు,వెదురు ఉత్పత్తులతో యువతకు ఉపాధి కల్పన,ప్రభుత్వ రాయితీలు మొదలైన అంశంపై పర్యటిస్తున్నారు.
సీనియర్ వృక్ష శాస్త్ర వేత్త డాక్టర్ శ్రీకాంత్ గునగ,జూనియర్ శాస్త్రవేత్త రాహుల్ కుమార్,శాస్త్రసాంకేతిక పర్యవేక్షకులు సిద్ధి పెడ్నేకర్,అమృత త
బెలుసే,డీఎస్ అండ్ హెచ్ వో జంగా కిషోర్ లు ఆదివారం అశ్వారావుపేట లోని కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.ఈ కొబ్బరి విత్తన క్షేత్రం నందు ఉన్న వెదురు (బాంబూ) మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి కిషోర్ వెదురు సాగు వలన ఉపయోగాలు రైతులకు తెలియజేసినారు. అశ్వారావుపేట కొబ్బరి విత్తన క్షేత్రం నందు ఉన్న వెదురు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు.వెదురు నాటిన నుండి 3 సంవత్సరముల వరకు ప్రభుత్వ సబ్సిడీ పొందవచ్చని అన్నారు. టమాట,తీగ జాతి కూరగాయలైన బీర,కాకర, బొడకాకర,తీగల గార్డ్, చిక్కుడు,సొర,మొదలైనవి ట్రెల్లిస్,పందిరి,ఎగబాగించే పద్దతిలో సాగు చేయుటకు వెదురు కర్రలు అవసరం ఉంటుందని తెలిపారు. వెదురు ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
ప్రభుత్వ రాయితీలను తెలియజేసారు.రైతు పొలం గట్ల పై పెంచుట (బౌండరీ ప్లాంటేషన్) మూడవ సంవత్సరములకు రూ.15,000 లు,
రైతు పొలంలో పెంచుట (బ్లాక్ ప్లాంటేషన్) మూడవ సంవత్సరములకు రూ.20,000 లు అందజేస్తుంది అని తెలిపారు.