ఎద.. ఎద సవ్వడి

శ్రీచరణ్‌ రాచకొండ, గీత్‌ సైని జంటగా నటిస్తున్న సినిమా ‘కన్యాకుమారి’. ఈ చిత్రాన్ని రాడికల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై సజన్‌ అట్టాడ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి ‘ఎద ఎద సవ్వడి..’ అంటూ సాగే  లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు దర్శక, నిర్మాత సజన్‌ అట్టాడ లిరిక్స్‌ అందించగా, అనురాగ్‌ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నిడమర్తి అద్భుతంగా ట్యూన్‌  చేశారు. ‘ఎద ఎద సవ్వడి.. చేసెను సందడి, నువ్వు నన్ను తాకగా, రేగెను అలజడి, అట్ట అట్ట సూడకే ఎట్ట ఎట్ట ఆపనే, పొంగుతున్న ప్రేమనే.. పిల్లా’ అంటూ సాగుతుందీ పాట. ఈ  సినిమా నుంచి ఇప్పటికే హీరో విజరు దేవరకొండ రిలీజ్‌ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘కత్తిలాంటి పిల్లవే..’ సాంగ్‌ కూడా మంచి ఆదరణ పొందింది. త్వరలోనే ఈ  సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. ‘ఇదొక గ్రామీణ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి’ అని దర్శక, నిర్మాత  సృజన్‌ అట్టాడ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ – నరేష్‌ అడుప, సినిమాటోగ్రఫీ – శివ గాజుల, హరిచరణ్‌ కె, మ్యూజిక్‌ – రవి నిడమర్తి, సౌండ్‌ డిజైనర్‌ – నాగార్జున  తాళ్లపల్లి, కో ప్రొడ్యూసర్స్‌ – సతీష్‌ రెడ్డి చింతా, వరీనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్‌.ఎ, రచన, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ – సజన్‌ అట్టాడ.