హీరో విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు.మంచు విష్ణు పిల్లలు అరియానా, వివియానాల పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. ‘పాట పాడినా, నత్యం చేసినా, ఇది శివుని కోసం’ అని ఈ పోస్టర్‌లో చూపించారు. ‘పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హదయం గర్వంతో ఉప్పొంగు తోంది. నా చిన్ని తల్లులు తెరపై సష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’ అని మంచు విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.