కొడంగల్‌ కోర్టులో లొంగిపోయిన మరో నలుగురు నిందితులు

– 14రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌
– పోలీస్‌ కస్టడీకి భోగమోని సురేశ్‌
నవతెలంగాణ-కొడంగల్‌
వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఇతర ఉన్నత అధికారులపై దాడి కేసులో మరో నలుగురు నిందితులు కొడంగల్‌ కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ దాడి ఘటనలో నిందితులుగా ఉన్న శివకుమార్‌, హనుమంతు, రామచందర్‌, లోక్యనాయక్‌ సోమవారం లొంగిపోగా.. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.
లగచర్లలో ఘటనలో ప్రధాన నిందితుడు సంగారెడ్డి జిల్లా కంది జైల్‌లో ఉన్న భోగమెని సురేష్‌ను పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది. సురేష్‌ను రెండు రోజులపాటు విచారణకు అనుమతిస్తూ కొడంగల్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నవంబరు 19వ తేదీన కొడంగల్‌ కోర్టులో లొంగిపోయిన ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా కంది జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్‌ వేశారు. ఇరుపక్షాల వాదనాలు విన్న కోర్టు సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.